Shiva Nirvana: ఆ సినిమాలో ఓ సాంగ్ అధారంగా ఖుషి నినిమా తీశాం: శివ నిర్వాణ

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే విజయ్, సామ్, శివ నిర్వాణ, వెన్నల కిశోర్ కలిసి యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నెట్టింట ఒక చర్చ జరుగుతుంది.

ఈ సినిమా మణిరత్నం సూపర్ హిట్ మూవీ ‘సఖి’ రిఫరెన్స్‌తో రాబోతోందా..? అనే క్యూస్షన్స్ వినబడుతున్నాయి. తాజాగా దీని గురించి దర్శకుడు శివ నిర్వాణను ప్రశ్నించగా, తను బదులిస్తూ.. “పెళ్లి తరువాత ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద సినిమా తీయాలని అనుకున్నాను. ఇక ప్రేమ పెళ్లి అన్నప్పుడు ఏమి ఉంటుంది. రిజిస్టర్ మ్యారేజ్, ఫ్యామిలీ నుంచి విడిపోయి ఇద్దరు దూరంగా బ్రతకడం అనేది ప్రతి ఒక్కరు కథలో జరిగేది.

సాధారణంగా చాలా సినిమాలో ఈ విషయాలు అన్ని ఒక సాంగ్ లో ఫాస్ట్ గా చూపించేస్తారు. అయితే సఖి సినిమాలో ఆ సాంగ్ నే కథగా తీసుకున్నారు. ఇప్పుడు మేము ఆ పాటనే కథగా తీసుకున్నాము కాబట్టి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ మా సినిమా దానికి ఎటువంటి సంబంధం లేదు” అని వెల్లడించాడు. సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. మరి విజయ్ కి ‘లైగర్’తో మిస్ అయిన పాన్ ఇండియా హిట్ ని ఖుషి అందిస్తుందా? లేదా? చూడాలి. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమాలోని పాటలైతే మాత్రం సూపర్ హిట్గా నిలిచాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus