Shiva Nirvana: తన జోనర్ నే నమ్ముకున్న దర్శకుడు!

  • September 25, 2021 / 07:12 PM IST

‘నిన్నుకోరి’ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యాడు శివ నిర్వాణ. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రూపొందించిన ‘మజిలీ’ సినిమా మరో బ్లాక్ బస్టర్ అయింది. ఈ రెండు సినిమాలతో శివ నిర్వాణకు టాలీవుడ్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఇదే ఊపుతో నాని హీరోగా ‘టక్ జగదీష్’ అనే సినిమా తీశాడు శివ నిర్వాణ. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

సినిమాలో అసలు కామెడీ లేకపోవడం, సీరియస్ మోడీ లో సాగడం ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వలేదు. దీంతో శివ నిర్వాణ మరోసారి తనకు కలిసొచ్చిన లవ్ స్టోరీ జోనర్ లోనే సినిమా చేయాలనుకుంటున్నాడు. తన తదుపరి సినిమా కోసం మరో చక్కటి ప్రేమకథను రాస్తున్నట్లు తెలిపారు. ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వైజాగ్ బీచ్ లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. తనకు వైజాగ్ అన్నా, బీచ్ అన్నా చాలా ఇష్టమని చెప్పిన ఆయన..

సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో తన కథ అంత ఒరిజినల్ గా ఉంటుందని చెప్పారు. ఎమోషనల్ టచ్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus