Shivathmika: లేచిపోయింది ఎవరో చెప్పండి..? శివాత్మిక పోస్ట్ వైరల్!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘దొరసాని’ సినిమాతో ఆయన చిన్న కూతురు శివాత్మిక ఎంట్రీ ఇస్తే.. ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శివానీ రాజశేఖర్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నారు ఈ సిస్టర్స్. సోషల్ మీడియాలో వీరిద్దరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా వీరిద్దరూ దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు.

అక్కడ దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్లి ఉంటారని కొందరు భావించారు. మరికొందరు మాత్రం రాజశేఖర్ కూతురు బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోయిందని అంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై చాలా పోస్ట్ లు కనిపించాయి. ఓ సెక్షన్ వెబ్ మీడియా సైతం వార్తలు రాసింది. ఈ విషయం రాజశేఖర్ ఫ్యామిలీ వరకు వచ్చింది. దీంతో ఆయన చిన్న కూతురు శివాత్మిక ఫైర్ అయింది.

తల్లితండ్రులతో కలిసి దుబాయ్ కి వెళ్లినట్లు ఆమె తెలిపారు. దుబాయ్ లో దిగిన ఫ్యామిలీ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది శివాత్మిక. ఆ ఫొటో కింద ‘ఇప్పుడు చెప్పండి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు..? శివానీ కానీ నేను కానీ లేచిపోయింది ఎవరితో..? నాన్ సెన్స్ రూమర్స్.. నెక్స్ట్ లెవల్ న్యూస్ ఇది! రూమర్స్ రాసేటప్పుడు క్లారిటీగా ఉండండి.

లేచిపోయింది ఎవరు? నేనా? శివానీనా? బీ క్లియర్’ అంటూ మండిపడింది. ఈ పోస్ట్ ను శివానీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. లాఫింగ్ ఎమోజీను యాడ్ చేసింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus