బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజు ఆట ఆసక్తిగా మారింది. మొదటి రోజునే ప్రారంభం అయిన నామినేషన్స్ రెండో ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అయ్యాయి. దీంతో హౌస్ మేట్స్ వారికి నచ్చిన రీజన్స్ చెప్తూ ఇద్దరిని నామినేట్ చేశారు. అయితే, ఈ నామినేషన్స్ లో శోభాశెట్టి అలియాస్ మోనిత బాగా ఫేమస్ అయ్యింది. శోభా ప్లస్ మోనిత కలిపి శోభితగా మారిపోయింది. మొదట తను కిరణ్ రాథోడ్ ని ఇంకా గౌతమ్ ని నామినేట్ చేసింది.
ఇక్కడే కిరణ్ రాథోడ్ కి తెలుగు రాదని ఆమె షోలో కంటిన్యూ అవ్వడం కష్టం అంటూ రీజన్ చెప్పింది. ఇక గౌతమ్ కి తనకి ఐ కాంటాక్ట్ లేదని అస్సలు బాండింగ్ అనేది అక్కడ్నుంచీ రావట్లేదంటూ నామినేట్ చేసింది. మేడమ్ అని మాట్లాడినా కూడా నాకు వెటకారం చేస్తున్నట్లుగా అనిపిస్తోందనే రీజన్ చెప్పింది. దీంతో గౌతమ్ కృష్ణకి అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత తను ప్యాచ్ అప్ చేసుకోవడానికి వెళ్లి ఎక్స్ ప్లయిన్ చేస్తున్నా కూడా శోభాశెట్టి వినిపించుకోలేదు.
ఇదిగో ఇదే నీలో ప్రాబ్లమ్ అస్సలు వినిపించుకోవు అంటూ పొగరుగా మాట్లాడింది. ఆ తర్వాత గౌతమ్ శోభాశెట్టిని తిరిగి నామినేట్ చేస్తూ తక్కువగా వర్క్ చేసినట్లుగా నాకు అనిపించిందంటూ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ తనకి నచ్చలేదు. శోభాశెట్టి క్లారిటీ అడిగింది. ఇక్కడే ఇద్దరికీ మాటమాట వచ్చింది. అంతేకాదు, అంతకముందు తనని నామినేట్ చేసినందుకు థామినికి ఇచ్చిపారేసింది. అసలు నేను ఎక్కడ వర్క్ చేయలేదో క్లారిటీ గా చెప్పు అంటూ నిలదీసింది.
ఇలా తన కార్తీకదీపంలో మోనిత క్యారెక్టర్ ని హౌస్ మేట్స్ కి చూపించింది. ఇక మోనిత గేమ్ పై (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఆడియన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పూర్తిగా మోనితలా మారిపోయిన శోభా అని, శోభా గేమ్ ఓవర్ గా ఆడుతోందని, ఈ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, తను యాక్టివిటీ రూమ్ లో నామినేషన్స్ చేయడానికి వెళ్లినపుడు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.