బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ ఈసారి కూడా కెప్టెన్ ని ఎంచుకోవాల్సిన బాధ్యతని హౌస్ మేట్స్ పై పెట్టాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ మద్యలో మరోసారి మాటల యుద్ధం స్టార్ట్ అయ్యింది. కెప్టెన్సీ కంటెండర్స్ లో ఎవరినైతే అనర్హులు అని భావిస్తారో వారి మెడలో మిర్చి దండ వేసి తగిన కారణాలు చెప్పమని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని టార్గెట్ చేశారు. అశ్విని – భోలే ప్రియాంకని ఎలిమినేట్ చేశారు.
అమర్ ఇంకా తేజ ఇద్దరూ పల్లవి ప్రశాంత్ ని ఎలిమినేట్ చేశారు. యావర్ – రతిక ఇద్దరూ కలిసి శోభాశెట్టిని ఎలిమినేట్ చేశారు. శివాజీ – అర్జున్ సందీప్ మెడలో దండలు వేసి ఎలిమినేట్ చేసారు. దీంతో గౌతమ్ కి ఒక్క మిర్చి దండ కూడా పడలేదు. ఈ వారం ఇంటి కెప్టెన్ అయ్యాడు. అయితే, ఇక్కడ రీజన్స్ చెప్పేడపుడు యావర్ కి ఇంకా శోభాశెట్టి ఇద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. యావర్ చెప్పిన రీజన్ కి ససేమిరా ఒప్పుకోలేదు శోభాశెట్టి. బక్వాస్ రీజన్ నువ్వు పిచ్చోడివి అంటూ నోరుజారింది.
నేను పిచ్చోడినా నేను పిచ్చోడినా అని గట్టిగా అరిచాడు ప్రిన్స్. అవును నువ్వు పిచ్చోడివే అంటా కన్ఫార్మ్ చేసింది శోభాశెట్టి. ఫ్రస్టేషన్ తట్టుకోలేని ప్రిన్స్ యావర్ మెరపకాయల దండని నేలకేసి కొట్టాడు. దీంతో శోభాశెట్టి స్వయంగా వెళ్లి మరో దండని మెడలో వేసుకుంది. నేను కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకుంటున్నాను. ఇక మీ ఇష్టం అంటూ రెచ్చిపోయింది. కెప్టెన్సీ టాస్క్ లో రతిక కూడా శోభాశెట్టినే నామినేట్ చేసి తీసేసింది. దీనికి శోభాశెట్టి చాలా బాధపడింది.
చెప్పిన రీజన్ కూడా ఆమెకి నచ్చలేదు. దీంతో రతికపై ఆగ్రహాన్ని చూపించింది. ఇక పల్లవి ప్రశాంత్ కూడా మరోసారి అమర్ ని నిలదీశాడు. నేను ఎందుకు ఇంకోసారి కెప్టెన్ అవ్వకూడదు చెప్పు అంటూ అడిగాడు. అది నారీజన్ ఒక్కసారి కెప్టెన్ అయిన వాళ్లని నేను మరోసారి అవ్వనివ్వను అంటూ అమర్ రెచ్చిపోయి మరీ మాట్లాడాడు. మరోవైపు ప్రియాంకకి ఇంకా అశ్వినికి కూడా గట్టిగానే పడింది. ఎందుకు రీజన్స్ చెప్పడం రానప్పుడు గేమ్ ఆడద్దని ప్రియాంక గట్టి వార్నింగ్ ఇచ్చింది.
తర్వాత భోలే షవాలి కూడా పగపట్టినట్లుగా ప్రతిసారి ప్రియాంకనే టార్గెట్ చేస్తున్నాడు. దీంతో ప్రియాంక కూడా కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకుంది. ఈవారం కెప్టెన్సీ రేస్ హౌస్ లో పెద్ద మంటలు రేపింది. 8వ వారం నామినేషన్స్ , అలాగే కెప్టెన్సీ కోసం పోటీ కూడా బిగ్ బాస్ సీజన్ 7కి మంచి హైప్ ని తీస్కుని వచ్చాయి. మరి ఈసారి (Bigg Boss 7 Telugu) ఎలిమినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది చూడాలి. అదీ మేటర్.