బాహుబలి రూమర్లపై స్పందించిన నిర్మాత శోభు
- May 18, 2017 / 01:51 PM ISTByFilmy Focus
బాహుబలి సినిమాలోని కీలక పాత్రల కోసం ముందుగా ఒకరిని సంప్రదించడం, వారు కాదంటే వేరొకరిని తీసుకోవడం జరిగాయి. అది సినిమా కి ముందు బయటికి రాలేదు కానీ ఇప్పుడు బాగా వెలుగులోకి వస్తున్నాయి. శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవిని అడిగారని, అలాగే కట్టప్ప క్యారక్టర్ కి మోహన్ లాల్ ని సంప్రదించారని వారి తిరస్కరిస్తే ఆ పాత్రలను రమ్య కృష్ణ, సత్యరాజ్ పోషించారనే సంగతి కొన్ని అనుమానాలకు తావు నిచ్చాయి. ఇంతకీ బాహుబలి పాత్రకు ప్రభాస్ కంటే ముందు ఎవరినైనా సంప్రదించారా? అనే ప్రశ్న ఇతర భాషా ప్రజల్లో మెదులుతోంది. ఆ ప్రశ్నను జాతీయ మీడియా నిర్మాత శోభు యార్లగడ్డ ముందు ఉంచింది.
అందుకు ఆయన స్పందిస్తూ “బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. యంగ్ రెబల్ స్టార్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ రాశారు. అందుకే మేము వేరెవరినీ సంప్రదించలేదు. మరొకరిని సంప్రదించినట్టు వార్తల్లో నిజం లేదు” అని స్పష్టం చేశారు. ప్రసాద్ తో కలిసి శోభు 250 కోట్లతో నిర్మించిన బాహుబలి కంక్లూజన్ 1600 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













