Prabhas: ఏడాది గ్యాప్ లో ఇలా చేయడం ప్రభాస్ కే సాధ్యం.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (Adipurush) , సలార్ (Salaar) , కల్కి (Kalki 2898 AD) సినిమా థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలలో ఆదిపురుష్ ఆశించిన ఫలితాన్ని అందుకోకాపోయినా మిగతా రెండు సినిమాలు మాత్రం అంచనాలను మించి సక్సెస్ అయ్యాయి. కల్కి సినిమా 800 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈరోజు సాధించే కలెక్షన్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కానుంది.

ఆంధ్రాలోని కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమని తెలుస్తోంది. టికెట్ రేట్లు మరీ భారీగా ఉండటం ఈ సినిమాపై ప్రభావం చూపింది. అయితే ప్రభాస్ గత మూడు సినిమాలలో ఒక ప్రత్యేకత ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ గతానికి చెందిన సినిమా కాగా సలార్ వర్తమానానికి చెందిన సినిమా అనే సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ మాత్రం భవిష్యత్తుకు సంబంధించిన సినిమా కావడం గమనార్హం.

ఏడాది గ్యాప్ లో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు చెందిన సబ్జెక్ట్ లలో నటించడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ వేగంగా సినిమాలను రిలీజ్ చేస్తుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ స్పీడ్ ను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పవచ్చు. స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తుండగా రాజాసాబ్ సినిమాతో మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ మాత్రం అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ప్రభాస్ త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయి.

508901 ,508839 ,508835

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus