Karuna Kumar: అడ్డంగా బుక్కైపోయిన కరుణ కుమార్.. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు..!

  • November 17, 2024 / 10:23 AM IST

‘పలాస’తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కరుణ కుమార్  (Karuna Kumar)  . చాలా వరకు కొత్త వాళ్ళతో చేసిన ఆ సినిమా క్రిటిక్స్ ను మెప్పించింది. హానెస్ట్ అటెంప్ట్ అనిపించుకుంది. ఆ తర్వాత ఓటీటీలో ఆ సినిమాని బాగా చూశారు. అయితే కరుణ కుమార్ చేసిన రెండో సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Center) ప్లాప్ అయ్యింది. ఇటీవల ఈ సినిమాకి కారణాలు కూడా చెప్పుకొచ్చాడు కరుణ కుమార్.’‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాని చాలా సిన్సియర్ గా చేయాలి అనుకున్నాను. కానీ మిగిలిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది.

Karuna Kumar

కథలో చాలా మంది చేతులు పెట్టి కెలికేశారు.అలా మిగతావాళ్లు ఇన్వాల్వ్ అవుతారు అని నాకు ముందుగా తెలిస్తే..ఆ సినిమా చేసేవాడిని కాదు. రైటింగ్లోనూ, టేకింగ్‌లో కూడా అందరూ వేలు పెట్టేశారు.అలా సినిమా స్క్రిప్ట్‌ మారిపోయింది. దీంతో ఏదీ నా కంట్రోల్లో లేకుండా పోయింది. ఫైనల్ గా ఫలితం కూడా తేడా కొట్టేసింది’ అంటూ ఆ సినిమా ప్లాప్ కి కారణాలు చెప్పుకొచ్చాడు కరుణ కుమార్. బాగానే ఉంది. ‘టు మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రోత్’ అన్నట్టు ఒకవేళ కరుణ కుమార్ కంట్రోల్లో లేకపోతే ఫలితం అలాగే వస్తుంది.

కానీ ఇప్పుడు ‘మట్కా’ (Matka)   సంగతేంటి. నిర్మాతలు కరుణ కుమార్ కి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, డబ్బులు బాగా పెట్టారు అని స్వయంగా అతనే చెప్పాడు. ‘కళాపురం’ వంటి సినిమా చూశాక కూడా వరుణ్ తేజ్ వంటి మెగా హీరో ఛాన్స్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా విషయంలో హీరో వందకి వంద శాతం న్యాయం చేశాడు. నిర్మాతలు కూడా బాగా సహకారం అందించారు. మరి ‘మట్కా’ ఎందుకు జనాలని ఆకట్టుకోలేకపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే.

డైరెక్షన్ బ్యాడ్ అని..! అలాంటప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకి కరుణ కుమార్ (Karuna Kumar) చెప్పిన కారణాలు సరైనవి అని ఎవరైనా అనుకుంటారా? అందుకే సక్సెస్ క్రెడిట్ ఎలా అందరికీ చెందుతుందో.. ప్లాప్ డెబిట్ కూడా అందరికీ చెందుతుంది అని ఒక మాట అనాలి. అలా కాకుండా ‘వాళ్ళ వల్లే ప్లాప్ అయ్యింది’ అనడం సరైన పద్ధతి కాదు కదా..! కరుణ కుమార్ వంటి గొప్ప రైటర్ కి ఇది తెలియని విషయం కాదు. మరి ఎందుకో కానీ ట్రాక్ తప్పాడు.

‘ది గోట్’.. పెద్ద ప్లాప్ గా మిగిలిన ‘ది గోట్’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus