బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో మూడోవారం ఎలిమినేషన్ అత్యంత నాటకీయంగా జరిగింది. ఈసారి నామినేషన్స్ లో మొత్తం 12మంది ఉన్నారు. ఇందులో సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా నామినేషన్స్ లోకి వచ్చారు. 12మందిలో ఆరుగురు సేఫ్ జోన్ లో ఉన్నారు. వీళ్లలో అఖిల్, బిందుమాధవి, అరియానా, యాంకర్ శివ, హమీదా,మహేష్ విట్టా లు సేఫ్ గా ఉన్నారు. మిగతా ఆరుగురులోనే ఎలిమినేషన్ ఉంటుందని భావించారు అందరూ.
Click Here To Watch NEW Trailer
అయితే, ఇక్కడే లేడీ కంటెస్టెంట్స్ అయిన మిత్రా శర్మా, ఇంకా స్రవంతి చొక్కారపు ఇద్దరూ కూడా అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో లీస్ట్ లో ఉన్నారు. వీరితో పాటుగా అజయ్ ఇంకా చైతూ లు కూడా తక్కు ఓటింగ్ పర్సెంటేజ్ ని పొందారు. ఒకవేళ మేల్ కంటెస్టెంట్ వెళ్లిపోవాల్సి వస్తే ఆర్జే చైతూ లేదా అజయ్ లలో ఒకరు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఆదివారం నాగార్జున ఎపిసోడ్ లో అనూహ్యంగా ఆర్జే చైతూ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.
ఆర్జే చైతూతో పాటుగా తేజస్వి ఇంకా నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. నిజానికి ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. నటరాజ్ మాస్టర్, తేజస్వి, ఆర్జే చైతూ, అజయ్, స్రవంతి ఇంకా మిత్రా శర్మా వీళ్లలోనే ఎలిమినేషన్ జరుగుతుందని అందరూ భావించారు. వీళ్లలో నుంచీ ఆర్జే చైతూని ఎలిమినేట్ చేశారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉండే అర్హత చైతూకి ఉంది. తన గేమ్ ని ఎంతో స్ట్రాటజీగా, చాలా లాజికల్ గా ఆడుతున్నారు. అందర్నీ కలుపుకుంటూ పోతున్నాడు.
కెప్టెన్ గా తన బాధ్యతలని బాగానే నిర్వర్తించాడు. ఈ వారం సేఫ్ అయినట్లయితే, వచ్చే వారం తనకి ఇమ్యూనిటీ వచ్చేది. ఇక ఆర్జే చైతూ ఎలిమినేషన్ అనేది హౌస్ లో అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు, బయట ఆడియన్స్ కూడా ఆర్జే చైతూ సేఫ్ జోన్ లోనే ఉన్నారని భావించారు. కానీ డేంజర్ జోన్ లోకి వచ్చాడు. మూడోవారం అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. గత రెండు వారాలుగా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వెళ్లిపోతున్న ఈ సమయంలో మేల్ కంటెస్టెంట్స్ బోటమ్ లో ఉన్నది ఆర్జే చైతూనే. అందుకే ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడు.
ఒక్క భోళా శంకర్ తీసేస్తే.. ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్, ‘ఆచార్య’ లో చరణ్, బాబీ మూవీలో రవితేజ నటిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టులో ఏ హీరో భాగమవుతాడో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!