స్టార్ హీరో బాలకృష్ణ వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా బాలయ్య రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే బాలయ్యకు కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ లు ఏ స్థాయిలో వచ్చాయో ఫ్లాపులు కూడా అదే స్థాయిలో వచ్చాయి. బాలయ్య నటించిన కొన్ని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పును పొందలేదు.
అయితే బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్యకు సినీ కెరీర్ పరంగా కలిసొచ్చి స్టార్ స్టేటస్ రావడంతో పాటు ఆయన మార్కెట్ రేంజ్ మరింత పెరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్య కోరుకున్న విజయాలు దక్కాయని కూడా బాలయ్య ఫ్యాన్స్ లో చాలామంది భావిస్తారు. బాలయ్య పారితోషికం విషయానికి వస్తే ప్రస్తుతం 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా బాలయ్య పారితోషికం ఉంది.
బాలయ్య సినిమాల హక్కులు భారీ రేటుకు అమ్ముడవుతున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అనే సెంటిమెంట్ సైతం ప్రచారంలోకి వస్తోంది. బాలయ్య దర్శకులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే వరుస హిట్లు సాధిస్తున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యాక్షన్ సీన్స్ సైతం మరింత స్పెషల్ గా ఉండేలా బాలయ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలయ్య రేంజ్ మరింత పెరుగుతుండగా 2024 సంవత్సరంలో (Balakrishna) బాలయ్య రెండు ప్రాజెక్ట్ లను రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. బాలయ్యను బాబీ ఎలా చూపించనున్నారో చూడాల్సి ఉంది. పవర్ ఫుల్ రోల్స్ కు ఓటేస్తున్న బాలయ్య యంగ్ జనరేషన్ కు నచ్చే స్క్రిప్ట్స్ పై ఫోకస్ పెడుతున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.