Chiranjeevi , Janhvi Kapoor: చిరంజీవి జాన్వీ కపూర్ కాంబో మూవీ వార్తల్లో అసలు నిజం ఇదే!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఏ మాత్రం నమ్మశక్యం కాని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. చిరంజీవి వశిష్ట కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు ఐదుగురు నుంచి ఆరుగురు హీరోయిన్లు అవసరం అని తెలుస్తోంది. అనుష్క, త్రిషలలో ఎవరో ఒకరు మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. మిగతా రోల్స్ కోసం క్రేజ్ ఉన్న 30 ప్లస్ హీరోయిన్లను ఎంపిక చేయనున్నారు.

అయితే కొంతమంది మాత్రం చిరంజీవికి జోడీగా జాన్వీ కపూర్ ను అడిగారని జాన్వీ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ వార్తలను ప్రచారం చేయడంపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చిరంజీవి ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవిని కావాలని కించపరిచేలా ప్రచురితమవుతున్న కొన్ని కథనాలపై అభిమానుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి త్వరలో విశ్వంభర షూట్ లో పాల్గొననున్నారు. ఒకింత భారీ బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మరోసారి భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విశ్వంభర సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రీఎంట్రీలో చిరు (Chiranjeevi) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus