Hansika Motwani: హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

  • October 31, 2022 / 08:24 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సికకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. హన్సిక పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా తాజాగా ఆ వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. హన్సిక డేటింగ్ లో ఉన్న వ్యక్తి పేరు సోహాల్ కతూరియా అని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన సోహాల్ తో డిసెంబర్ 4వ తేదీన హన్సిక వివాహం జరగనుందని సమాచారం అందుతోంది. హన్సిక సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లికి రెండు రోజుల ముందు నుంచి సంగీత్, మెహిందీ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలు కాగా హన్సిక పెళ్లి వార్త అభిమానులకు ఆనందాన్ని కలగజేస్తోంది. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక 31 సంవత్సరాల వయస్సులో పెళ్లిపై ఆసక్తి చూపడం గమనార్హం. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్ లోని జైపూర్ లో ముండోటా ప్యాలేస్ లో హన్సిక వివాహం జరగనుంది. సోహాల్ కంపెనీలో హన్సికకు షేర్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే గదులు కూడా బుక్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హన్సిక పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతారో లేదో స్పష్టత రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఆమె సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు హన్సిక రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పోల్చి చూస్తే తమిళంలో హన్సికకు సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. భవిష్యత్తులో హన్సిక నిర్మాతగా కూడా కొనసాగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హన్సిక పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందనుందని తెలుస్తోంది. హన్సిక కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాలి. ప్రస్తుతం హన్సిక రెండు కోట్ల రూపాయల నుంచి రెండున్నర కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus