Hero Nani: నాని మార్కెట్ పెరిగిందిగా.. కొత్త సినిమా హక్కులు ఎంతో తెలుసా?

దసరా సినిమాతో నాని కీర్తి సురేష్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. నాని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దసరా మూవీ మరీ అద్భుతం అని చెప్పలేం కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలతో పోల్చి చూస్తే మాత్రం బెస్ట్ మూవీ అని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం నాని మృణాల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. దసరా సినిమా డిజిటల్ హక్కులు 19 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆ సినిమాతో పోల్చి చూస్తే దాదాపుగా రెట్టింపు మొత్తానికి ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి. నాని మార్కెట్ అంచనాలకు అందని స్థాయిలో పెరగడంతో ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తున్నారు. నానికి వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దసరా సక్సెస్ తో నాని (Nani) పారితోషికం 25 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నాని లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నటిస్తుండగా నిన్ను కోరి మూవీ తరహాలో ఈ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది. అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సీవీ మోహన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నార్త్ ఇండియాతో సంబంధం లేకుండా ఈ సినిమా హక్కులను విక్రయించారని తెలుస్తోంది.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులతో కలిపి 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు దసరా మూవీ మూడు రోజుల్లో 68 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈరోజు కూడా ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus