రెండు తెలుగు రాష్ట్రాల్లో లియో మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి ఇప్పటికే పలు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సితార నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో భగవంత్ కేసరి మూవీకి ధీటుగా బుకింగ్స్ జరిగాయనే సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా క్రేజ్, మార్కెట్ లేని విజయ్ సినిమాకు జరిగిన బుకింగ్స్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. అయితే ట్విట్టర్ లో లియో స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.
లియో కలెక్షన్లలో నిజం లేదని ప్రాక్సీ బుకింగ్స్ తో మోసం చేశారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఈ సినిమా రిలీజైన థియేటర్ల సంఖ్యకు, ఈ మూవీ కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లియో సినిమా తొలిరోజు 148 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని మేకర్స్ చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించిందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.
ఈ సినిమాపై అంచనాలు పెంచడం కోసం థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ ను క్రియేట్ చేయడం జరిగిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. లియో స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల ఈ సినిమా మేకర్స్ పరువు పోతుండటం గమనార్హం. పెద్ద సినిమాల కలెక్షన్లు ఎప్పుడూ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. గ్రాస్ కలెక్షన్లను ప్రకటించిన విధంగా షేర్ కలెక్షన్లను ప్రకటించరు కాబట్టి ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మరోవైపు విజయ్ 68వ సినిమా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ప్రభుదేవా, స్నేహ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. (LEO Movie) ఈ సినిమాతో విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.