మహేష్ తల్లి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ అభిమానులను సైతం ఎంతగానో బాధపెట్టింది. సితార వెక్కివెక్కి ఏడ్చటంతో పాటు సోషల్ మీడియా వేదికగా సితార చేసిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఇందిరా దేవి మృతితో ఆమె స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందిరా దేవి తమ గ్రామానికి ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇందిరా దేవి తన కొడుకులైన రమేష్ బాబు, మహేష్ బాబులతో ముసలిమడుగుకు వచ్చి వెళ్లేవారని బోగట్టా. ఇందిరా దేవి పేరుపై ముసలిమడుగులో ఒక ఇల్లు ఉందని తెలుస్తోంది. ఈ గ్రామంలో ఇందిరా దేవి కొడుకులు, కూతుళ్ల పేర్లపై పొలాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది. మహేష్ కుటుంబ సభ్యులు ఇందిరా దేవి ఇంటి స్థానంలో భద్రాచలంకు వచ్చే భక్తుల కొరకు వసతి గృహం నిర్మించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగాయి.

ఇందిరా దేవి మరణం కృష్ణ కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెట్టింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఇందిరా దేవి తన వంతు సహాయం చేసి వాళ్ల సమస్యలను పరిష్కరించేవారని సమాచారం. ఇందిరాదేవి మీడియాకు దూరంగా ఉండేవారు. కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు, ఈవెంట్లకు మాత్రమే ఆమె హాజరయ్యేవారని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి కృష్ణ ఫ్యామిలీని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కూడా ఇందిరా దేవి మృతికి సంతాపం తెలియజేశారు. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఇందిరా దేవి అంత్యక్రియలకు చిరంజీవి హాజరు కాలేదు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలంటూ చిరంజీవి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus