టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించిన నిర్మాత ఎవరనే ప్రశ్నకు దిల్ రాజు పేరు సమాధానంగా వినిపిస్తుంది. అయితే ఏ నిర్మాతపై వినిపించని స్థాయిలో దిల్ రాజుపై ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. దిల్ రాజు వల్లే తమ సినిమాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమ సినిమాలకు దిల్ రాజు థియేటర్లు దొరక్కుండా చేశారని కొంతమంది హీరోలు పరోక్షంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అయితే దిల్ రాజు మాత్రం తన తప్పేం లేకపోయినా వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో తన గురించి నెగిటివ్ ప్రచారం జరుగుతుండటంతో ఫీలవుతున్నారు. అయితే దిల్ రాజు ఉత్తరాంధ్రలో తన దగ్గర కేవలం 37 థియేటర్లు మాత్రమే ఉన్నాయని 37 థియేటర్లతో ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవడం సాధ్యమేనా అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్ల సంఖ్య తక్కువే అయినా ఇండస్ట్రీ ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
దిల్ రాజు థియేటర్లలో కొన్ని థియేటర్లు ప్రైమ్ లొకేషన్లలో ఉండటంతో పాటు ఆ థియేటర్లలో రిలీజైన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి. దిల్ రాజు మాటను దాటి సినిమాలను రిలీజ్ చెయ్యడానికి ఇతర నిర్మాతలు ఇష్టపడరు. ఈ రీజన్ వల్లే తక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్నా దిల్ రాజు ఇండస్ట్రీలో పైచేయి సాధిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు వారసుడు సినిమా తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. అనుమతులు లేకుండా సినిమాలో ఏనుగులతో సీన్లను చిత్రీకరించడంపై వివాదం నెలకొంది.
ఈ వివాదాన్ని దిల్ రాజు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. దిల్ రాజు తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుండగా ఈ సినిమాలు మంచి లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే విధంగా దిల్ రాజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.