సూపర్ స్టార్ కృష్ణ మరణం ఆయన కుటుంబ సభ్యులను, ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కృష్ణ మరణ వార్త విని టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఏఎన్నార్ కు సన్మానం జరగగా ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ కావాలని భావించారు. కెరీర్ తొలినాళ్లలో నటనపై అవగాహన పెంచుకోవడం కోసం కృష్ణ పలు నాటకాల్లో నటించడం గమనార్హం. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన కృష్ణ 1989 సంవత్సరంలో ఏలూరు ఎంపీగా విజయం సాధించారు.
ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా కృష్ణ పేరును సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణను ఇంజనీర్ చేయాలని తండ్రి కోరుకోగా కృష్ణ మాత్రం సినిమాలపై ఆసక్తి చూపించారు. కొడుకులు కోడళ్లు సినిమాలోని పాత్రతో కృష్ణ కెరీర్ మొదలు కాగా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా సినిమా ఆఫర్లు మాత్రం కృష్ణకు తేలికగా రాలేదు. పదండి ముందుకు సినిమాలో చిన్న రోల్ లో నటించిన కృష్ణ ఆ తర్వాత మురళీ కృష్ణ, పరువు ప్రతిష్ట, కులగోత్రాలు సినిమాలలో చిన్న పాత్రలలో నటించారు.
ఆ తర్వాత కృష్ణ కాదలిక్క నేరమిల్లై అనే సినిమాకు ఎంపిక కాగా తమిళం రాకపోవడం వల్ల ఈ సినిమాలో కృష్ణ అవకాశం కోల్పోయారు. ఆ తర్వాత సొంతూరికి తిరిగొచ్చిన కృష్ణ తేనె మనసులు సినిమాకు సంబంధించిన పేపర్ ప్రకటన చూసి ఆ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించి ఛాన్స్ సొంతం చేసుకున్నారు.
గూఢచారి 116 సంచలన విజయంతో కృష్ణ కెరీర్ మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లలో కృష్ణ ఏకంగా 115 సినిమాలలో నటించారంటే సినిమాలు అంటే కృష్ణకు ఏ స్థాయిలో అభిమానం ఉందో సులువుగానే అర్థమవుతుంది. కృష్ణ అంత్యక్రియలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయని సమాచారం.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!