Vijay: విజయ్ ను యంగ్ గా చూపించడానికి అయ్యే ఖర్చు తెలిస్తే షాకవ్వాల్సిందే!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ వారసుడు, లియో సినిమాలతో తెలుగునాట మార్కెట్ ను పెంచుకున్నారు. విజయ్ భవిష్యత్తు సినిమాలకు సైతం ఇక్కడ 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా విజయ్ 68వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో విజయ్ 19 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ సీన్స్ లో విజయ్ ను యంగ్ గా చూపించడం కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. డీ ఏజింగ్ టెక్నిక్ తో విజయ్ వయస్సును తగ్గించనున్నారని భోగట్టా. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తుండటం గమనార్హం. విజయ్ ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

మానాడు సినిమాతో ప్రశంసలు అందుకున్న వెంకట్ ప్రభుకు కస్టడీ సినిమాతో భారీ షాక్ తగిలింది. వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా విజయ్ ఛాన్స్ ఇవ్వగా వెంకట్ ప్రభు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది. విజయ్ తన లుక్ విషయంలో విమర్శలు రాకూడదని వయస్సును తగ్గించడం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.

సినిమా సినిమాకు విజయ్ (Vijay) రేంజ్ పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు విజయ్ కోరుకున్న భారీ విజయాలను అందిస్తాయో లేదో చూడాల్సి ఉంది. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న విజయ్ కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విజయ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags