సమాజంలో జరుగుతున్న దారుణమైన సంఘటనలు చూస్తుంటే మనుషులు ఎటు వెళ్తున్నారో అర్థం కావడం లేదు.. పరిస్థితులు, సాంకేతికత వంటివి ఎంతో ఉన్నతంగా తయారవుతున్నప్పటికీ మనిషి స్వభావం, మానసిక స్థితిగతులు, ఆలోచన విధానాలు మారడం లేదు.. సినీ పరిశ్రమలో కొద్ది కాలంగా వరుస మరణాలు, ప్రమాదాలు సంభవిస్తుండడంతో పరిశ్రమ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా ఓ నటి కొడుకు కన్న తండ్రి, తోడబుట్టిన సోదరిని అతి కిరాతకంగా హత్య చేశాడనే వార్తతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది.. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని మన్గాడు అడిసన్ నగర్‌లో శాంతి – సెల్వరాజ్ దంపతులు నివాసముంటున్నారు..
శాంతి కోలీవుడ్‌లో సహాయ నటి.. పలు సినిమాల్లో నటించారు.. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.. పెద్దబ్బాయికి పెళ్లై, ఫ్యామిలీతో కలిసి వేరు కాపురం ఉంటున్నాడు.. కూతురికి కూడా వివాహమైంది.. వీరి ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది.. వీళ్ల రెండో కొడుకు ప్రకాష్ డ్రగ్స్‌కు బానియ్యాడు.. దీంతో కొంచెం మానసికంగా దెబ్బతిన్నాడు.. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు తనను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు.. ఇటీవల చికిత్సకు డబ్బులు సరిపోకపోవడంతో ఇంటికి తీసుకు వచ్చారు.. అయితే ఆదివారం (మార్చి 19) ఇంట్లోనే నిద్రిస్తున్న తండ్రి సెల్వరాజ్ గొంతు కోసి హత్య చేశాడు.. ఆ తర్వాత సమీపంలోని సోదరి ఇంటికి వెళ్లి ఆమెతో కూడా వాగ్వాదానికి దిగాడు..
గొడవ పడుతున్న సమయంలో వెంట తెచ్చుకున్న కత్తితో సోదరిని పొడిచి చంపాడు.. అదే సమయంలో తల్లి శాంతి షాప్‌కి వెళ్లడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.. ఆమె వచ్చేలోగా తండ్రి, సోదరిని హత్య చేసి పరారయ్యాడు.. ఇంటికి వచ్చిన శాంతి.. భర్త రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారమందించింది.. అటు కుమార్తె కూడా హత్యకు గురి కావడంతో ఆమె వేదన వర్ణనాతీతం.. మృత దేహాలను పోస్టుమార్టంకు పంపిన పోలీసులు నిందితుడు ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు.. అతను తమిళ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసినట్లు సమాచారం.. కాగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి..
తిరిగి తనను మెంటల్ ఆసుపత్రికి పంపాలని తన తల్లి, సోదరి అనుకుంటుండగా విన్నానని దీంతో కోపంతో అందర్ని చంపాలని అనుకున్నానని చెప్పాడు.. ముందుగా అమ్మను చంపాలని భావించానని, అయితే ఆమె బయటకు వెళ్లడంతో తప్పించుకుందని, పడుకున్న తన తండ్రిని గొంతు కోసి చంపానని, అదే కత్తితో తన అక్కను పొడిచి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని పెరంబదూర్ కోర్టులో హాజరు పరిచారు.. తర్వాత చికిత్స కోసం చెన్నైలోని అయనవరం మెంటల్ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.. తండ్రిని, సోదరిని చెల్లిని దారుణంగా హతమార్చిన ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది..