Vaishali Takkar : చనిపోయేముందు వైశాలి టక్కర్ ఎంతో నరకం అనుభవించిందట

బుల్లితెర నటి వైశాలి టక్కర్‌ అక్టోబర్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. పలు హిందీ సీరియల్స్ లో నటించి ఈమె బాగా పాపులర్ అయ్యింది. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’.. ‘ససురాల్‌ సిమర్‌ కా’ వంటి సీరియల్స్‌ ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అక్టోబర్‌ 16, 2022న.. ఈమె తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 29 ఏళ్లకే ఈమె మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. అయితే ఆమె చనిపోయిన ప్లేస్లో పోలీసులకు 12 పేజీల సూసైడ్‌ నోట్‌ లభించినట్టు కూడా ఓ వార్త హల్ చల్ చేసింది.

ఈ లేఖలో తన పక్కింట్లో ఉండే రాహుల్‌ అనే బిజినెస్మెన్, మరియు అతని భార్.. ఈమెను శారీరకంగా, మానసికంగా చాలా బాధపెట్టారని ఆ లేఖలో రాసి ఉంది. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ భార్యను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అక్కడితో అయిపోలేదు వైశాలి ఆత్మహత్య వెనుక దాగి ఉన్న ఓ బలమైన కారణాన్ని పోలీసులు గుర్తించారు. అసలు విషయంలోకి వెళితే.. వైశాలి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ అయిన రాహుల్‌ నవ్లాని మరియు అతని భార్య దిశా నవ్లాని… పలు వీడియోలతో ఈమెను బ్లాక్ మెయిల్ చేశారట.

వైశాలి తో ప్రేమలో ఉన్నట్టు నటించిన రోజుల్లో రాహుల్ ఈ వీడియోలను సేకరించినట్టు తెలుస్తుంది. రాహుల్‌కి.. పెళ్లైందన్న సంగతి తెలిసినా వైశాలి అతన్ని ప్రేమించింది. ఇదే క్రమంలో 2021 ఆగస్టులో వైశాలి – రాహుల్ కలిసి గోవా ట్రిప్‌ కు వెళ్లారట.అదే టైంలో రాహుల్‌.. వైశాలిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్‌ చేసి… ఆమెతో మరింతగా ఎంజాయ్ చేశాడు.. అదే సమయంలో వైశాలికి తెలీకుండా వీడియోలు చిత్రీకరించాడు. ట్రిప్ ముగిసాక.. వీరు తిరిగి ఇంటికి వచ్చాక వైశాలి.. పెళ్లి అంటే రాహుల్ మొహం చాటేసేవాడు.

వైశాలి పెళ్లి టాపిక్ తెస్తే.. రాహుల్ చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను బయటపెడతాను అని బెదిరించాడట. సరే అని సరిపెట్టుకుని.. మితేష్‌ గౌర్‌ అనే వ్యక్తితో వైశాలి పెళ్ళికి రెడీ అయితే, రాహుల్.. మితేష్ కు వైశాలి ప్రైవేట్ వీడియోలను పెట్టాడట. దీంతో వైశాలి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో వైశాలి డిప్రెషన్ కు గురయ్యి.. తనని రాహుల్ సుఖంగా బ్రతకనివ్వడు అని భావించి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ సూసైడ్ నోట్లో రాసిందట వైశాలి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus