Samantha: ఆ యాడ్ ను సామ్ తిరస్కరించడానికి కారణమిదేనా?

  • June 13, 2022 / 06:18 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక, సమంత ముందువరసలో ఉంటారు. పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ అయినా సమంత చేసిన స్పెషల్ సాంగ్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. సోషల్ మీడియాలో రష్మిక, సమంత యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసింది. ఈ ఇద్దరు హీరోయిన్ల సంపాదన కూడా ఊహించని స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ ఇద్దరు హీరోయిన్లు స్నేహపూర్వకంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే రష్మికను చూసి సమంత భయపడుతోందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు రష్మిక ఇటు సమంత పలు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రముఖ పట్టుచీరల కంపెనీ ఈ ఇద్దరు హీరోయిన్లను తమ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ లో నటించడానికి సంప్రదించగా సమంత ఆ యాడ్ లో నటించలేనని తేల్చి చెప్పారని సమాచారం. ఈ విషయం తెలిసిన రష్మిక అభిమానులు సమంత రష్మికను చూసి భయపడుతోందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

అయితే మరి కొందరు మాత్రం ఒక యాడ్ ను రిజెక్ట్ చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయని రష్మిక కంటే సమంతకే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని కామెంట్లు చేస్తున్నారు. రష్మిక యాడ్ ను రిజెక్ట్ చేసి ఉంటే ఆమె ఫ్యాన్స్ ఇలాగే స్పందించేవారా అంటూ సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ వల్లే హీరోయిన్లు కలిసి నటించడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తల గురించి సమంత, రష్మిక ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్మిక, సమంత ప్రస్తుతం దాదాపుగా ఒకే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రష్మిక, సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus