రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. దానికి సినిమాకు కూడా ఎంచక్కా ఆపాదించొచ్చు. ఎందుకంటే సినిమా వాళ్లు కూడా ఇలా శాశ్వత మిత్రుత్వం, శత్రుత్వం లేకుండా బతికేస్తుంటారు. అందుకే ఎన్నికల సందర్భంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, కొన్నిసార్లు శ్రుతిమించి తిట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి. తర్వాత ఏదైనా వేదికపై మీద కనిపిస్తే హత్తుకొని, మాట్లాడుకుంటారు. అయితే ఇది సినిమా ఇండస్ట్రీకి వర్తిస్తాయా అంటే… కష్టమే అని చెప్పాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషణ్ (మా) ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతోంది.
అయితే మధ్యలో కొంతమంది నటులు, ప్యానల్ సభ్యులు శ్రుతి మించి విమర్శలు చేస్తున్నారు. ‘మా’ సంఘానికి సంబంధించిన అంశాలు, చేద్దాం అనుకుంటున్న విషయాలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితం జరిగిన విషయాలు పట్టుకొచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు అనేది పక్కనపెడితే, సంబంధం లేని మాటలే వస్తున్నాయి. దాని వల్ల వాళ్ల మధ్య సంబంధాలు బలహీనపడతాయి.
ఎన్నికలు అయ్యాక ఇప్పుడు విమర్శిస్తున్నవాళ్లే, రేపు కలసి పని చేయాల్సి ఉంటుంది. రాజకీయాలు అంటే వేర్వేరు పార్టీల వాళ్లు కాబట్టి ఓకే.కానీ సినిమాలంటే ఒకే ఇంట్లో అన్నమాట. మరి ఈ సమయంలో ఇలా నోరు చేసుకొని, బంధాలను చెడగొట్టుకోవడం ఎందుకో.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!