ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి మే నెల రెండవ వారం వరకు విడుదల కాబోయే టాలీవుడ్ పెద్ద సినిమాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ స్టార్స్ వారం లేదా రెండు వారాల గ్యాప్ తో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి డేట్లు ఇచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో త్వరలో ఏపీలో ఆంక్షలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెల 10వ తేదీనాటికి ఏపీ టికెట్ రేట్లకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
అయితే ఎఫ్3, ఆచార్య సినిమాలు మాత్రం కేవలం ఒక్కరోజు గ్యాప్ లో ఏప్రిల్ 28, ఏప్రిల్ 29 తేదీలలో రిలీజ్ కానున్నాయి. ఎఫ్3 సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి, ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ ఖాతాలలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదనే సంగతి తెలిసిందే. సాధారణంగా దిల్ రాజు సోలో రిలీజ్ డేట్ కే ఆసక్తి చూపుతారు. అయితే ఆచార్య సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేసిన నేపథ్యంలో దిల్ రాజు పంతానికి పోతున్నారని తెలుస్తోంది.
ఎఫ్3, ఆచార్య ఒకే సమయంలో విడుదలైతే రెండు సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకవు. అయితే ఎఫ్3 ముందుగా ప్రకటించిన డేట్ కే విడుదలవుతోందని ఆచార్య మరో తేదీని ఫిక్స్ చేసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆచార్య, ఎఫ్3 సినిమాల నిర్మాతలలో ఎవరో ఒకరు తగ్గితే రెండు సినిమాలకు ప్రయోజనం చేకూరుతుంది. మే 4వ వారానికి ఏదో ఒక సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆచార్య సినిమాలో మెగా హీరోలైన చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తుండగా ఎఫ్3 సినిమాలో మెగా హీరో వరుణ్ తో పాటు వెంకటేష్ నటిస్తున్నారు. మెగా హీరోలు రిలీజ్ డేట్ మార్పు విషయంలో చొరవ చూపుతారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!