‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ రూపొందించనున్నట్టు తెలుస్తుంది. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమవ్వనుంది అని టాక్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఆగిపోయింది కాబట్టి విడుదల లేట్ అవుతుందని వార్తలు వచ్చాయి.
దీంతో ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ తరువాత సినిమా పై పడిందని … దాంతో త్రివిక్రమ్ లాక్ అయిపోయాడని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజంలేదనేది తాజా సమాచారం. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంట్లో నుండే చేస్తున్నారట రాజమౌళి అండ్ టీమ్. మరో పక్క ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయట. నటీ నటులను అందరినీ ఫైనల్ చేసి.
జూలై ఎండింగ్ లో సినిమాని మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ ఇచ్చేలా పక్కా ప్లాన్ తో ఉన్నారట. అయితే పాన్ ఇండియా సినిమా కాబట్టి లేట్ అయినా 2021 దసరాకి అయినా సినిమా ఫినిష్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయట. కాబట్టి త్రివిక్రమ్ ఖాళీగా ఉండే అవకాశాలు అయితే లేవు. దీంతో త్రివిక్రమ్ … ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వల్ల లాక్ అయిపోయాడు అనే వార్తలు అన్నీ అవాస్తవం అని తెలుస్తుంది.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్