అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎఫ్4 సినిమాను కూడా తెరకెక్కించే అవకాశం ఉందని చెప్పారు. ఎఫ్3 ఎండ్ టైటిల్స్ లో కూడా ఎఫ్4 సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడింది. అయితే ఎఫ్4 సినిమాలో వెంకీ, వరుణ్ కనిపించరని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎఫ్3 సినిమాకు వెంకటేష్, వరుణ్ తేజ్ గత సినిమాల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఎఫ్3 సినిమాకు బడ్జెట్ ఎక్కువగానే ఖర్చైందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఎఫ్4 సినిమాకు బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కారణాల వల్ల ఎఫ్4 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లకు బదులుగా వేరే హీరోలను తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ వల్లే ఎఫ్3 సినిమా హిట్ గా నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లేకుండా ఎఫ్4 సినిమాను తెరకెక్కిస్తే మాత్రం సినిమా రిజల్ట్ పై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అనిల్ రావిపూడి, దిల్ రాజు అలాంటి తప్పు చేయరని నెటిజన్లు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ఎఫ్4 సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అనిల్ రావిపూడి క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఎఫ్3 సినిమాకు అనిల్ రావిపూడి రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.
డబుల్ హ్యాట్రిక్ సాధించడంతో దర్శకుడిగా అనిల్ రావిపూడి రేంజ్ సైతం పెరిగింది. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా అనిల్ రావిపూడి సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. స్టార్ హీరోలు అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తే అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.