SSMB28: ఆ తప్పు వల్లే త్రివిక్రమ్ మూవీపై ఇలాంటి ప్రచారమా?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం ఒకవైపు డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలకు తన వంతు సహాయసహకారాలను అందిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల విషయంలో సైతం త్రివిక్రమ్ జోక్యం చేసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలై కథ విషయంలో మహేష్ సంతృప్తి చెందకపోవడంతో ఆగిపోయిందని కామెంట్లు వినిపించాయి.

కొంతమంది ఈ కామెంట్లు నిజమేనని నమ్మారు. అయితే నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పరోక్షంగా స్పష్టతనిస్తూ త్వరలో త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుందని చెప్పుకొచ్చారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ వేగంగా జరిగితే మాత్రమే ఈ తరహా ప్రచారం ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అప్ డేట్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ కావడం పూజా హెగ్డేకు ఎక్కువగా ముఖ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూజా హెగ్డే కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది.

మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటుండగా ఆ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. మహేష్ బాబు మాత్రం తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus