‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ … ఇద్దరూ కూడా లైఫ్ పెట్టి పనిచేశారు. దర్శకుడు రాజమౌళి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఇచ్చాడు. కానీ ఇప్పటికీ కొంతమంది ఎన్టీఆర్.. ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ రోల్ చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిందో రాజమౌళి కూడా చెప్పుకొచ్చాడు. ‘ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి ఫీలింగ్ అభిమానులకు కనిపించదు. సెకండ్ హాఫ్ లో కొమరం భీముడొ పాత్ర వరకు ఎన్టీఆర్ లోని భావోద్వేగం బయటపడుతుంది.
ఆ కాసేపు ఎన్టీఆర్ గొప్పగా కనిపిస్తాడు. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి రాంచరణ్ లోని భావోద్వేగం బయటపడుతుంది. సో బయటకు వచ్చినప్పుడు చరణ్ హైలెట్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇద్దరికీ సమానమైన పాత్రలే ఇవ్వడం జరిగింది’ అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా కొంతమంది అజ్ఞానులకు అది అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం.
‘వార్2’ అనే బాలీవుడ్ బడా ప్రాజెక్టులో భాగం కానున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది నిర్మాణ సంస్థ నుండి వచ్చిన అధికారిక ప్రకటన అయితే కాదు. అలాగే ఎన్టీఆర్ టీం కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సరే ఇందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు అంటున్నారు. ‘వార్ 1’ లో హృతిక్ – టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించారు. అందులో టైగర్ ష్రాఫ్ విలన్ గా నటించాడు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ చేసినటువంటి పాత్రనే ఎన్టీఆర్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. అయితే కొంతమంది ఈ ప్రాజెక్టు పై మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ (Jr NTR) పై సెటైర్లు వేస్తున్నారు. ఈసారైనా ఎన్టీఆర్ ను సైడ్ క్యారెక్టర్ ను చేయకుండా హృతిక్ తో సమానమైన రోల్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలతో ఓ సినిమా చేస్తున్నాడు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?