Samantha: పుష్ప స్పెషల్ సాంగ్ వెనుక అసలు కథ ఇదే!

పుష్ప ది రైజ్ లో స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఓకే చెప్పిందనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. పదేళ్ల సినీ కెరీర్ లో సమంత ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు. అయితే పుష్ప ది రైజ్ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు విడాకుల ప్రకటన తర్వాత సామ్ స్పెషల్ సాంగ్ చేయడం గురించి జోరుగా చర్చ జరిగింది. అయితే సమంతకు ఈ ఛాన్స్ రావడానికి చిరంజీవి కారణమని సమాచారం.

చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత డిప్రెషన్ కు గురైంది. సమంత సోషల్ మీడియా పోస్టుల ద్వారా అభిమానులకు సైతం ఆ విషయం అర్థమైంది. విడాకుల గురించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి రాగా సమంత ప్రత్యక్షంగా ఆ వార్తల గురించి స్పందించకపోయినా విడాకుల వల్ల తాను హర్ట్ అయినట్టు చెప్పకనే చెప్పేశారు. తనపై ప్రచారంలోకి వచ్చిన ఫేక్ వార్తలను సైతం ఆమె ఖండించారు. అయితే పుష్ప మూవీకి పని చేసిన ఒక వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం

మెగా ఫ్యామిలీ ఫంక్షన్ కు సమంత హాజరైన సమయంలో సమంత డిప్రెషన్ లో ఉన్నారని గుర్తించిన చిరంజీవి విడాకుల తర్వాత లైఫ్ గురించి ఆమెతో మాట్లాడారని సమాచారం. సుకుమార్ కు పుష్ప సినిమాలో సమంతతో స్పెషల్ సాంగ్ చేయించాలని చిరంజీవి సూచించడం సుకుమార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పుష్ప ది రైజ్ లో సమంత ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరకు సమంతను ఫైనల్ చేశారు.

ఈ పాట హిట్ కావడంతో సమంతకు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ సాంగ్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప సినిమా పలు ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. పుష్ప ది రైజ్ తో బన్నీకి ఇతర భాషల్లో మంచి గుర్తింపు వచ్చింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus