బిగ్ బాస్ షోలో వీకండ్ వచ్చిందంటే నాగార్జున ఎపిసోడ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శనివారం ప్రోమో ఎప్పుడెప్పుడు వస్తుందా అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. కానీ, ప్రోమోలో ఉన్న మేటర్ ఎపిసోడ్ లో ఎక్కడా కనిపించదు. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ప్రోమో బెస్ట్ ఎపిసోడ్ వేస్ట్ అని అంటున్నారు. శనివారం నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు హౌస్ మేట్స్ వెనక్కి వెళ్లి మాట్లాడిన మాటలు,
వేరే హౌస్ మేట్స్ గురించి చేసిన కామెంట్స్, వాళ్ల గేమ్ తీరు వీటన్నింటిని ప్రశ్నించాలని కోరుకుంటారు. కానీ, నాగార్జున మాత్రం సరదాగా హౌస్ మేట్స్ ని పలకరిస్తూ నాలుగు కుళ్లు జోకులు వేసి ఎపిసోడ్ ముగిస్తుంటే మాత్రం ఆడియన్స్ కి ఒళ్లు మండిపోతోంది. గత సీజన్స్ తో పోలిస్తే, ఈ సీజన్ లో నాగార్జున యాంకరింగ్ కాస్త బెటర్ గానే కనిపిస్తోంది. అయినా కూడా వీకండ్ షో చప్పగా సాగుతోంది. గత సీజన్స్ కి వచ్చినంత రేటింగ్ రావట్లేదు.
శనివారం హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ చెప్పే నాగార్జున, ఆదివారం వారితో కొన్ని గేమ్స్ ఆడించి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఆదివారం ఎపిసోడ్ లో అంత కిక్ రాకపోయినా, శనివారం ఎపిసోడ్ కోసమే చాలామంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తు ఉంటారు. కానీ, రీసంట్ గా రెండు మూడు వారాల నుంచీ ఆడియన్స్ లో ఆసక్తి సన్నగిల్లుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి హౌస్ మేట్స్ శనివారం నాగార్జున ఇచ్చే ఇన్ పుట్స్ ఆధారంగానే సోమవారం నామినేషన్స్ చేస్తారు.
ఎవరు మిస్టేక్ చేస్తున్నారు గేమ్ లో అని ఒక క్లారిటీకి వస్తారు. కానీ, ఈ సీజన్ లో అది కనిపించడం లేదు. ఇప్పుడు శనివారం ఎపిసోడ్ కి రేటింగ్ కూడా మెల్లగా తగ్గిపోతోంది. ప్రోమోలో హౌస్ మేట్స్ ని కడిగిపారేస్తున్నట్లుగా బిల్డప్ ఉంటుంది. కానీ, ఎపిసోడ్ లో మాత్రం కొన్ని పాయింట్స్ వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఈసీజన్ లో గీతు, ఆదిరెడ్డిల రివ్యూలు ఎక్కువైపోయాయి. గీతు రూడ్ గా మాట్లాడుతున్నా కూడా నాగార్జున క్లాస్ పీకలేని పరిస్థితి ఉంది. అంతేకాదు, జెన్యూన్ గా గేమ్ ఆడదాం అని వచ్చిన సెలబ్రిటీలు వీరిద్దరి రివ్యూలతో కన్ఫూజ్ అయిపోతున్నారు.
గేమ్ ని అర్ధం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వీళ్లకి డోస్ ఇవ్వడంలో ఎందుకో కొన్ని పాయింట్స్ ని వదిలేస్తున్నారు. అంతేకాదు, వీకండ్ నాగార్జున ఎపిసోడ్స్ చూడకుండా బిగ్బాస్ టీమ్ ఇచ్చే ఇన్ పుట్స్ పైనే ఆధారపడి హౌస్ మేట్స్ ని పలకరిస్తున్నారు. దీనివల్ల వారం అంతా జరిగిన గొడవలు, ఇన్సిడెంట్స్ అస్సలు గుర్తుండటం లేదు. చూసే ప్రేక్షకులు మాత్రం ఎవరిది తప్పు అనే క్లారిటీతో ఉన్నారు. మరి ఈసీజన్ 6కి నాగార్జున రానున్న వారాల్లో ఎలా ముగింపు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.