మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్న అంటే ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది. ప్లాప్ అంటూ లేని కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మాత్రం సరిపోదా.. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ కట్ చేస్తే మూవీ మొదటి షోతోనే ఎవ్వరూ ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది.
అభిమానులను సైతం ఈ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి రోజు ఈ మూవీ దారుణమైన వసూళ్లు రాబట్టింది. రెండో రోజున కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. వీకెండ్ వరకు ఈ సినిమా నిలబడుతుందనేది డౌట్ గానే ఉంది. ఇదిలా ఉండే.. ‘ఆచార్య’ రిజల్ట్ ప్లాపైనా మెగా అభిమానులు దానిని లైట్ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని విషయాలు వాళ్ళను మరింతగా హర్ట్ చేశాయని చెప్పాలి. కొరటాల శివ గత చిత్రాల్లో స్లో నేరేషన్ ఉన్నా..
ఏది కూడా ఇంత ఘోరమైన కథనం ఉండవు. ఇందులో ఎలివేషన్స్ సీన్లు వచ్చినా ఏదో తెలీని వెలితి. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో చిరు లుక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆయన మొహంలో ఎనర్జీ లేదు. ‘వరప్రసాద్ గారు- రామ్ గారు’ అంటూ చరణ్ తో చేసిన సన్నివేశం, ‘భలే బంజారా’ సాంగ్లో తప్ప చిరు.. నటనలో ఏమాత్రం పూర్వ వైభవం కనిపించలేదు. ఓ సన్నివేశంలో ‘సత్యదేవ్ పాత్ర చనిపోతూ చిరుకి తన కొడుకుని అప్పగిస్తారు’ ఆ సీన్లో చిరు లుక్ ను వి.ఎఫ్.ఎక్స్ లో చాలా దారుణంగా చూపించారు.
కొంచెం వరుణ్ తేజ్ లా ఉన్నాడు అని చాలామంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే వి.ఎఫ్.ఎక్స్ లో చిరు లుక్ మార్చే కంటే వరుణ్ తేజ్ నే ఒకరోజు షూటింగ్ కు రప్పించి ఆ సీన్లో నటించమంటే సరిపోయేది కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఓ డికేడ్ కు సరిపోయే ట్రోలింగ్ స్టఫ్ ను ‘ఆచార్య’ అందించినట్టు అయ్యింది.