RRR: ‘ఆర్ఆర్ఆర్’ కామెంట్స్ విషయంలో స్టార్ హీరోయిన్‌పై పిచ్చ ట్రోలింగ్..!

సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఫ్లోలో పొరపాటున టంగ్ స్లిప్ అవడం.. దాని ద్వారా ట్రోలింగ్‌కి గురవడం వంటి సంఘటనలు చాలానే చూశాం.. రీసెంట్‌గా ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం, ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ సాధించి.. తెలుగు సినిమాకి ప్రపంచ పటంలో స్థానం కల్పించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ – (రణం రౌద్రం రుధిరం).. అయితే ట్రిపులార్ గ్రేట్ తమిళ్ సినిమా అంటూ స్టార్ హీరోయిన్ అనడంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు..

వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లో సెటిల్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. RRR కి ఆస్కార్ వచ్చినప్పుడు ఇండియన్ సినిమా మరో మెట్టు ఎక్కిందని సంబర పడిపోయింది.. అంతేనా, ఆస్కార్స్ వేడుక కోసం వెళ్లిన ట్రిపులార్ టీంకి లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది.. ఇంతా చేసిన ప్రియాంక ఇది తమిళ సినిమా అనడంతో ట్రోలింగ్ బారిన పడింది.. రీసెంట్‌గా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వూలో పాల్గొంది..

బాలీవుడ్ సినిమాల గురించి ఇంటర్వూ చేస్తున్న వ్యక్తి ప్రియాంకను ప్రశ్నలడగడంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పింది.. ఇంటర్వూ చేస్తున్న వ్యక్తి ట్రిపులార్ సినిమా గురించి మాట్లాడుతుండగా.. మధ్యలో కలగజేసుకున్న ప్రియాంక.. అది బాలీవుడ్ మూవీ కాదని ఓ తమిళం సినిమా అని చెప్పింది.. ‘‘ఆర్ఆర్ఆర్’ గ్రేట్ తమిళ్ మూవీ.. ఇది మనందరికీ అవెంజెర్స్ లాంటి మూవీ’ అని చెప్పింది.. దీంతో జనాలు షాక్ అయ్యారు..

‘ట్రిపులార్ మొన్నటిదాకా బాలీవుడ్ మూవీ అన్నారు.. ఇప్పుడు కోలీవుడ్ అంటున్నారు.. అసలు ఇది తెలుగు సినిమా అని ఇంకెప్పుడు గుర్తిస్తారు?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ‘ఏంటి ప్రియాంక ఇది.. నువ్వు కూడానా?.. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా’ అని సలహాలిస్తూనే.. ‘మీరు మా మనోభావాలు దెబ్బతీశారు’ అంటున్నారు.. కాగా ప్రియాంక హిందీ ఇండస్ట్రీలోని రాజకీయాల కారణంగానే హాలీవుడ్ వచ్చేశానంటూ చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus