Trivikram: ‘బ్రో’ లో ఆ డైలాగ్ గురించి త్రివిక్రమ్ పై ట్రోలింగ్!

‘బ్రో’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించాడు. తమిళంలో రూపొందిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి రీమేక్ గా ‘బ్రో’ రూపొందింది. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు.

అయితే తొలి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టిందని.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ నిరాశపరిచిందని ఎక్కువ శాతం కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ పై కూడా కొంత ట్రోలింగ్ జరుగుతుంది. విషయమేంటంటే ఈ సినిమాలో మార్కండేయ పాత్ర పోషించిన సాయి ధరమ్ తేజ్ … నటుడు తనికెళ్ళ భరణితో ఓ డైలాగ్ చెబుతాడు.

“హాల్లో షర్ట్ విప్పొచ్చు, బెడ్ రూంలో ఫాంటు విప్పొచ్చు,బాత్రూంలో అండర్ వేర్ కూడా విప్పొచ్చు,కానీ వీడిని ఎక్కడ విప్పాలో తెలియడం లేదు” అంటూ చెబుతాడు. ఈ డైలాగ్ ప్రాస కోసం రాశాడా లేక ఎవరినైనా విమర్శిస్తూ రాశాడా అన్నది స్పష్టత లేదు. అయినప్పటికీ ఈ డైలాగ్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. అందుకే కొంతమంది త్రివిక్రమ్ (Trivikram) పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus