గతేడాది విడుదలైన ప్రభాస్.. ‘సాహో’ చిత్రం ఫలితం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయినప్పటికీ.. తెలుగులో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ శాటిలైట్ బిజినెస్ చాలా ఆలస్యంగా జరిగింది. ‘సాహో’ చిత్రం తెలుగు శాటిలైట్ రైట్స్ కు ఎక్కువ రేటు దక్కుతుందేమో అని నిర్మాతలు మొదట ఆశపడి ఎవ్వరికీ అమ్మలేదు. అయితే రిలీజ్ తరువాత ‘సాహో’ కి ఎక్కువ రేటు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
చివరికి ‘జీ తెలుగు’ వారు రూ.14.5 కోట్లకు కొనుగోలు చేశారు. థియేటర్స్ లో భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమా కాబట్టి.. ‘సాహో’ బుల్లితెర పై కూడా రికార్డు టి.ఆర్.పి ని నమోదు చెయ్యడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.మొదటిసారి ‘సాహో’ ప్రీమియర్ టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 5.81 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే నమోదయ్యింది. అటు తరువాత రెండు వారాలకు ఈ చిత్రాన్ని మళ్ళీ టెలికాస్ట్ చెయ్యగా.. అప్పుడు కూడా కేవలం 4.11 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చెయ్యడం గమనార్హం.
రాంగ్ టైంలో ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యడం వలన అనుకుంట.. మరీ ఘోరమైన టి.ఆర్.పి రేటింగ్ లు నమోదవుతున్నాయి. ‘కె.జి.ఎఫ్’, ‘ఐ’ వంటి చిత్రాలు ఆలస్యంగా టెలికాస్ట్ అయినప్పటికీ మంచి టి.ఆర్.పి రేటింగ్ లనే నమోదు చేసాయి. అయితే ‘సాహో’ విషయంలో అలా జరగడం లేదు. ఇలా అయితే.. ‘సాహో’ చిత్రం శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన ‘జీ తెలుగు’ వారు సేఫ్ అవ్వడం కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!