Devara: దేవర రిలీజ్ వరకు ఆ సస్పెన్స్ కొనసాగనుందా.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  దేవర(Devara)  సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లను గమనిస్తే ఎన్టీఆర్ పోస్టర్లు దాదాపుగా సిమిలర్ గానే ఉన్నాయి. తారక్ ఈ సినిమాలో నిజంగానే డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా లేదా అనే సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ లో సైతం తారక్ కు సంబంధించిన ఒక్క లుక్ మాత్రమే ఉంటుందని సమాచారం అందుతోంది. సినిమాలో సెకండ్ లుక్ రివీల్ అవుతుందని ఆ పాత్రకు సంబంధించిన ట్విస్టులు సైతం మామూలుగా ఉండవని భోగట్టా.

Devara

వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం దేవర మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కుతుండగా ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్లు రానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ లుక్స్ లో దేవర ఒకటని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో వారానికి ఒక అప్ డేట్ వచ్చేలా మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. దేవర రెండో భాగం 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమాకు జాన్వీ కపూర్ గ్లామర్ హైలెట్ గా నిలవనుందని భోగట్టా.

దేవర1, దేవర2 పాన్ ఇండియా హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకింత ఎక్కువ నిడివితోనే థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. దేవర టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus