ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై దాదాపుగా 25 రోజులైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం ఆగడం లేదు. కేజీఎఫ్2 విడుదలైనా ఆర్ఆర్ఆర్ సినిమాకు కలెక్షన్లు భారీస్థాయిలోనే వస్తున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ విషయంలో ఆసక్తికర ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులను నిర్మాత నుంచి కొనుగోలు చేసిన పెన్ స్టూడియోస్ అధినేత జయంత్ లాల్ గడ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం హిందీతో పాటు ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ మొదట ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ మోడల్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ పే పర్ వ్యూ పద్ధతిలో చూడటానికి కొంతకాలం అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ఓటీటీలో ఫ్రీగా చూసే ఛాన్స్ ఉంటుందని బోగట్టా. ఆర్ఆర్ఆర్ హిందీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా శాటిలైట్ హక్కులు జీ సినిమా(హిందీ) దగ్గర ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ సౌత్ సినిమాల డిజిటల్ హక్కులు జీ5 సొంతం చేసుకోగా సౌత్ సినిమాల శాటిలైట్ హక్కులు స్టార్ నెట్వర్క్ సొంతం కావడం గమనార్హం. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా భాషల్లో డబ్ కానుందని జయంత్ లాల్ గడ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ అయిన భాషల్లో కూడా శాటిలైట్, డిజిటల్ రూపంలో అందుబాటులోకి వసుందని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ హిందీలో 240 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
బాహుబలి2 స్థాయిలో కాకపోయినా హిందీలో ఈ సినిమాకు భారీస్థాయిలోనే కలెక్షన్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో చూడాలంటే కనీసం మూడు నెలలు ఆగాల్సిందేనని బోగట్టా. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో కూడా సంచలనాలను సృష్టించడం గ్యారంటీ అని చరణ్, తారక్ అభిమానులు భావిస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!