Siva Balaji: శివబాలాజీ ప్రేమ పెళ్లి కథలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో శివబాలాజీ ఒకరు. ఈ మధ్య కాలంలో శివబాలాజీకి ఆఫర్లు తగ్గినా అడపాదడపా ఆఫర్లతో శివబాలాజీ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాను చిన్న రుమ్ లో రెంట్ కు ఉండేవాడినని శివబాలాజీ వెల్లడించారు. 2009 సంవత్సరంలో శివ బాలాజీకి మధుమితతో మ్యారేజ్ జరిగింది. మా నాన్న చెన్నైలో ఒక కంపెనీని రన్ చేస్తున్నారని చాలామంది మా కంపెనీలో చాలామంది పని చేసేవారని ఆ కంపెనీ వ్యవహారాలను కొంతకాలం పాటు నేను చూసుకున్నానని శివబాలాజీ తెలిపారు.

నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం నాన్నకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాకు 40,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నానని శివబాలాజీ తెలిపారు. ఆ తర్వాత చిన్న రూమ్ రెంట్ కు తీసుకున్నానని ఒక్కపూట మాత్రమే తినేవాడినని వెల్లడించారు. మధుమిత, నేను ప్రేమించుకున్నామని జాతకాలు చూపిస్తే పెళ్లి జరిగితే మా అమ్మ చనిపోతుందని జ్యోతిష్కులు చెప్పారని ఆయన అన్నారు.

మధుమిత మాట్లాడుతూ ఆ సమయంలో స్నేహితులుగా ఉందామని బాలాజీ చెప్పినా నేను వినలేదని కామెంట్లు చేయడం గమనార్హం. ఆ తర్వాత శివబాలాజీ మళ్లీ టచ్ లోకి వచ్చాడని ఏడాదిన్నర తర్వాత జాతకాలు చుపిస్తే అప్పుడు బాగున్నాయని చెప్పారని మధుమిత వెల్లడించారు. ఆ సమయంలో పెళ్లి జరిగిందని మధుమిత అన్నారు. మదుమితకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధ పడ్డానని శివబాలాజీ అన్నారు.

ప్రస్తుతం (Siva Balaji) శివబాలాజీ, మధుమిత అన్యోన్యంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. శివబాలాజీ, మధుమిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావడంతో పాటు మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus