గత నెల 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ త్రివిక్రమ్ మూవీ హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడయ్యాయి. మహేష్ బాబు ఒకవైపు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూనే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తాడని ఫ్యాన్స్ భావించారు. అయితే మహేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. సర్కారు వారి పాట పూర్తైన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించనున్నారు.
నవంబర్ నెల నుంచి త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచాయి.
త్రివిక్రమ్ మహేష్ తో ఇండస్ట్రీ హిట్ సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ మహేష్ ను ఈ సినిమాలో కొత్తగా చూపించబోతున్నారని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో నటించనున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న మహేష్ బాబు కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.