Shraddha Das, Hyper Aadi: ముద్దు అడిగితే షాకిచ్చిన శ్రద్ధాదాస్.. ఏమైందంటే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన ఢీ షో మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఢీ14 ప్రోమో తాజాగా రిలీజ్ కాగా ప్రోమోలో హైపర్ ఆది హీరోయిన్ శ్రద్ధా దాస్ ను ముద్దు కావాలని అడిగాడు. శ్రద్ధా దాస్ హిందీలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అడగగా ఒక ముద్దు కాదు రెండు ముద్దులు కావాలని ఆది అన్నారు. ఆ తర్వాత ప్రదీప్ రెడీ 123 అని చెప్పగా శ్రద్ధా దాస్ ఆది రెండు చెంపలపై గట్టిగా కొట్టారు.

ఆ తర్వాత ముద్దు అంటే తప్పడ్ అని చెప్పింది ఎవడురా అని హైపర్ ఆది ప్రదీప్ ను తిట్టారు. ఆ తర్వాత ముద్దు అంటే గూసా అని అనీ మాస్టర్ చెప్పగా అరగంట గూసా అని ఆది శ్రద్ధాదాస్ తో అన్నారు. ఆ తర్వాత శ్రద్ధాదాస్ ఆది చెస్ట్ పై వరుసగా పంచ్ లు ఇచ్చారు. ఈ ప్రోమోకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఢీ షో లేటెస్ట్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆది జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే గతంలోలా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఆది ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. హైపర్ ఆది గతంలోలా కడుపుబ్బా నవ్వించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా ఆది ఆ ఆఫర్లను పెద్దగా పట్టించుకోవడం లేదనే సంగతి తెలిసిందే.

చాలామంది జబర్దస్త్ కమెడియన్లు ఇతర ఛానెళ్లలోకి వెళ్లడం ద్వారా కెరీర్ ను కోల్పోయారు. అందువల్లే హైపర్ ఆది ఇతర ఛానెళ్లపై ఆసక్తి చూపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హైపర్ ఆది కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హైపర్ ఆది తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus