Shraddha Kapoor: కాన్ మ్యాన్ తో శ్రద్ధాకపూర్ కి లింకులు!

బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిలకు భారీగా గిఫ్ట్ లు ఇచ్చినట్లుగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వెల్లడించాడు కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్. ఇప్పుడు తనకు మరింతమంది బాలీవుడ్ సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయని.. వారి కూడా తన నుంచి వివిధ రకాలుగా లాభం పొందినట్లుగా తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ పేరు వినిపిస్తోంది. శ్రద్ధాకు సుఖేష్ పలు రకాలుగా సాయపడ్డాడట.

సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య సమయంలో శ్రద్ధా కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణను ఎదుర్కొనే పరిస్థితి రాగా.. అప్పుడు సుఖేష్ ఆమెకి అండగా నిలబడ్డాడట. ఏ విధంగా ఆమెకి హెల్ప్ చేశాడనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరో నటి శిల్పాశెట్టితో కూడా తనకు స‌త్సంబంధాలున్న‌ట్టుగా సుఖేష్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు. ఇటీవలే శిల్పాశెట్టి భార్య పోర్న్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం నుంచి కాస్త ఊరట పొందుతోంది శిల్పాశెట్టి.

ఇంతలో సుఖేష్ ఆమె పేరుని వెల్లడించాడనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వీరితో పాటు నాటు హర్మాన్ బవేజా కూడా తనకు సన్నిహితుడే అని చెబుతున్నాడు సుఖేష్. అతడి సినిమా ఒక దానికి తను కూడా డబ్బు పెట్టినట్లుగా సుఖేష్ చెప్పుకొచ్చాడు. అయితే సుఖేష్ కావాలనే కేసుని కాంప్లికేట్ చేయడానికి ఇలా చెబుతున్నాడా..? లేక నిజంగానే బాలీవుడ్ లో ఇతడికి సెలబ్రిటీలతో రిలేషన్స్ ఉన్నాయా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus