భారీ అంచనాలతో వచ్చిన సినిమాకు విజయం అందించడం చాలా కష్టం. ఎందుకంటే ఏం చేసినా అంచనాలు ఇంకా ఉన్నాయి అని అనిపిస్తుంటుంది కాబట్టి. అలాంటి దేశంలో అతి పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈసారి సినిమా వస్తే భారీ స్థాయిలో రికార్డులు బద్ధలవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఇండియన్ సినిమా బాక్సాఫీసు దగ్గర ‘పుష్ప’రాజ్ పేరు మరోసారి మార్మోగిపోతుంది. ఈలోపు మరో పేరు మారుమోగబోతోంది.
‘పుష్ప: ది రూల్’ నుండి కొత్త పాటను రిలీజ్ చేస్తారని టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. శ్రీవల్లి అలియాస్ రష్మిక (Rashmika) మందనతో స్పెషల్ వీడియో చేయించి మరీ ఆ విషయం చెప్పింది. ఇది మంచి మెలోడీ అని సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి, ఆ పాట గురించి మరో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే ఆ పాటలు పాడే గాయని గురించి. పాటలు అంటున్నారు.. గాయని అంటున్నారు.. గాయనీమణులు అని అనాలి కదా అంటారా?
ఇక్కడ విసయమే అది. ‘పుష్ప: ది రూల్’ (Pushpa2) సినిమాలోని కొత్త పాటను ఆరు భాషల్లో ఒక్కరే పాడారట. ఆమెనే మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీలో పాటను శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) పాడారాట. ‘సూసేకీ..’ అని తెలుగులో పాడగా, ‘అంగారోన్..’ అంటూ హిందీలో ఆలపించారు. తమిళంలో ‘సూదానా..’ అని గొంతు సవరించగా, ‘కండాల్లో..’ అని మలయాళంలో సింగింగ్ చేశారు.
‘నోడొకా..’ అని కన్నడలో పాడగా.. బెంగాళీలో ‘ఆగునెర్..’ అని ఆలపించి మెప్పించారామె. మే 29న ఈ పాటలను ఘనంగా విడుదల చేయబోతోంది టీమ్. మరి అన్ని భాషల్లో ఆమె ఎలా పాడారో ఆ రోజే చూడాలి. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ‘పుష్ప: ది రూల్’ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించారు.