Shriya Saran: పబ్లిక్ లో ముద్దు పెట్టుకుంటే తప్పేంటి..?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రియా. అవకాశాలు తగ్గడంతో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు సైన్ చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమె నటించిన ‘దృశ్యం2’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉండగా.. శ్రియా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ముంబైలో ఓ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ కి తన భర్తతో కలిసి హాజరైంది. తన భర్తతో ఎప్పుడు బయటకొచ్చినా సరే.. ఒక లిప్ లాక్ ఫొటోకు పోజిస్తోంది శ్రియ. దీంతో ఈ విషయంపై మీడియా ఆమెని ప్రశ్నించింది. దానికి ఆమె తన ఇష్టం అన్నట్లుగా బదులిచ్చింది.

తన భర్త రష్యాకు చెందిన వ్యక్తి. వారి కల్చర్ లో అలా పబ్లిక్ గా ముద్దుపెట్టుకోకపోతే తప్పు అని.. కాబట్టి అలా చేస్తుంటామని.. అందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే రష్యాలో అది కల్చర్ ఏమో కానీ మన దేశంలో అలాంటి ఆచారం లేదు కదా అని తిరిగి ప్రశ్నిస్తే.. జవాబు చెప్పకుండా తప్పించుకుంది. మొత్తానికి ఆమె వైఖరి చూస్తుంటే ఇప్పట్లో ఈ ముద్దులు ఆగేలా లేవు. ప్రస్తుతం శ్రియ చేతిలో భారీ సినిమాలు లేవు కానీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

కానీ అవి ఆమె కెరీర్ కి సరైన జోష్ ఇవ్వలేకపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. ఆ సినిమా కూడా శ్రియ కెరీర్ కి హెల్ప్ కాలేకపోయింది. 40ల్లోకి ఎంటర్ అయిపోయిన తరువాత ఆమెకి మెయిన్ లీడ్ అంటే కష్టమే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ తో నెట్టుకొస్తుందేమో చూడాలి!

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus