Shruti Haasan: నెటిజన్ షాకింగ్ ప్రశ్న.. శృతి అదిరిపొయే రిప్లై!

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ 2021 సంవత్సరంలో క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరంలో శృతిహాసన్ నటించిన సలార్ సినిమాతో పాటు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రిలీజ్ కానుంది. వరుస సినిమాలతో శృతి హాసన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా శృతి హాసన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా శృతి హాసన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ సెషన్ ను నిర్వహించారు.

ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శృతి హాసన్ తనదైన శైలిలో జవాబిచ్చారు. అయితే ఒక నెటిజన్ మాత్రం హద్దులు మీరి ఇప్పటివరకు ఎన్నిసార్లు బ్రేకప్ చేసుకున్నావ్ అని శృతి హాసన్ ను ప్రశ్నించారు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలను పట్టించుకోరు. అయితే శృతి హాసన్ మాత్రం ఆ ప్రశ్నకు స్పందిస్తూ ధీటుగా బదులిచ్చారు. తనకు ఆ ప్రశ్న వేసిన వ్యక్తిని నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని శృతి ప్రశ్నించారు.

ఎవ్వరూ లేరని తాను అనుకుంటున్నానని ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుందని శృతి హాసన్ వెల్లడించారు. శృతి హాసన్ ఇచ్చిన జవాబును నెటిజన్లు సైతం తెగ మెచ్చుకుంటున్నారు. గతంలో శృతి హాసన్ లండన్ సింగర్ తో రొమాన్స్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల లండన్ సింగర్ కు, శృతి హాసన్ కు బ్రేకప్ జరిగింది. ప్రస్తుతం శృతి హాసన్ ఫేమస్ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన శంతను హజారికాతో ప్రేమలో ఉన్నారు.

2022 సంవత్సరంలో శృతి హాసన్ పెళ్లి కబురు చెబుతుందేమో చూడాల్సి ఉంది. శృతి హాసన్ పెళ్లి కబురు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్ తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా శృతి హాసన్ కు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus