శృతిహాసన్.. పలు తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘అనగనగా ఓ ధీరుడు’ ఈమె తెలుగులో నటించిన మొదటి చిత్రం. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ మూవీలో లక్ష్మీ మంచు విలన్ గా నటించింది. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. లక్ష్మీ మంచుకి పేరొచ్చింది కానీ శృతి హాసన్ కు ఈ మూవీ పెద్దగా కలిసి రాలేదు. ఈమె తమిళంలో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.ఆ టైంలో ఈమె పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
అయితే పవన్ కళ్యాణ్ కు జోడీగా చేసిన ‘గబ్బర్ సింగ్’ మూవీ.. ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ మూవీ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. అక్కడి నుండి ఈమె చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. అయితే ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో ఈమె కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. అందువల్ల ఈమె రేసులో వెనుక పడింది. అయితే ‘క్రాక్’ తో రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
సంక్రాంతికి ఈమె నటించిన ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో.. మెగా ఫ్యామిలీకి ఈమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అవ్వగా ‘కాటమరాయుడు’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ‘వకీల్ సాబ్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
ఇక రాంచరణ్ తో చేసిన ‘ఎవడు ‘ హిట్ అవ్వగా, అల్లు అర్జున్ తో చేసిన ‘రేసుగుర్రం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇంకో కో- ఇన్సిడెన్స్ ఏంటి అంటే.. మెగా హీరోలతో శృతి హాసన్ నటించిన ప్రతిసారి వాళ్ళు ప్లాపుల నుండి బయటపడ్డారు. అందుకే ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?