నాచురల్ స్టార్ నాని నటించిన గత రెండు సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన V సినిమా తో పాటు శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన టక్ జగదీష్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల అయింది. అయితే నాని ఈ రెండు సినిమాలతో కూడా పెద్దగా పాజిటివ్ టాక్ అయితే అందుకోలేకపోయాడు. ఇక ఆ తరువాత సినిమాను ఎలాగైనా బిగ్ స్క్రీన్ పైన విడుదల చేయాలని ఫిక్సయ్యాడు.
ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆంధ్ర టికెట్ల రేట్లు సినిమాపై కాస్త దెబ్బ కొట్టాయి అనే చెప్పాలి. లేకపోతే బాక్సాఫీస్ వద్ద ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండేవి.. ప్రస్తుతం నాని కూడా ఆ విషయంలో చాలా ఓపెన్ గా మాట్లాడడం హాట్ టాపిక్గా నిలిచింది. ఎవరు కూడా నోరుమెదపని సమయంలో పవన్ కళ్యాణ్ తర్వాత ధైర్యంగా చెప్పిన హీరోగా నాని మంచి క్రేజ్ అందుకున్నాడు.
ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 20 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా మరొక రెండు కోట్ల షేర్ వసూలు చేయగలిగితే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు అవుతుంది. ఇక సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాని సినిమా చాలా ఆలస్యంగా ఓటీటీ లోకి తెస్తారని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే గత రెండు సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను వీలైనంత వరకు థియేటర్లోనే ఉంచాలని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ సినిమాలు వస్తే. శ్యామ్ సింగరాయ్ స్క్రీన్స్ చాలా వరకు తగ్గిపోతాయి ఇక ఫైనల్ గా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలి అంటే మరొక వారం పాటు ఆగాల్సిందే.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!