Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!
- June 28, 2025 / 08:33 AM ISTByPhani Kumar
సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో ‘3 BHK’ (3BHK) అనే సినిమా రూపొందింది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘శాంతి టాకీస్’ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మించారు. శివకార్తికేయన్ తో ‘మహావీరుడు’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు అరుణ్ విశ్వ.

ఈ ట్రైలర్ 3 నిమిషాల 4 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న ఇంట్లో అవస్థలు పడుతూ ఉండటం, వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఆశపడటం.. అందుకోసం చేసిన సేవింగ్స్ సరిపోకపోవడం.. ఆ తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు ఈ ట్రైలర్లో చూపించారు. సొంతింటి కల చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ట్రైలర్ ఎక్కువ మందికి వెంటనే కనెక్ట్ అయిపోతుంది అని చెప్పాలి.

- 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
- 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
- 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
- 4 Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది
- 5 Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !
శరత్ కుమార్ (Sarathkumar) తండ్రి పాత్రలో సిద్దార్థ్ (Siddharth) కొడుకు పాత్రలో కనిపించనున్నారు. దేవయాని తల్లి పాత్ర పోషిస్తున్నారు. అర్థం కాని చదువుతో ఇబ్బంది పడుతూ మనోవేదనకు గురయ్యే పాత్రలో సిద్దార్థ్ జీవించినట్టు తెలుస్తుంది. ఇతని పాత్ర కూడా చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ అయితే చాలా మందికి రిలేటబుల్ అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :











