సిద్ధార్థ్.. పరిచయం అవసరం లేని పేరు. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో స్టార్ డం సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగు నాట మంచి మార్కెట్ ఏర్పరుచుకుని స్టార్ గా ఎదిగాడు సిద్దార్థ్. అయితే ఆ లవర్ బాయ్ ఇమేజ్ ను మాస్ ఇమేజ్ కి కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ లో వరుస ప్లాపులు ఎదురవడంతో రేసులో వెనుకబడ్డాడు. అయినప్పటికీ ఆ టైంలో ఇతను క్లాస్ సినిమా చేసినా దానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చేవి.
అలా కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ తో కూడా బాగానే గట్టెక్కాయి. అలాంటి వాటిలో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ కూడా ఒకటి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో ‘గోపాల గోపాల’ ‘కాటమరాయుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ పార్థసాని(డాలి) ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రానికి దర్శకుడు.’శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 2009 వ సంవత్సరంలో ఫిబ్రవరి 5 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదట ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. ‘సినిమా చాలా స్లోగా ఉందని’ చాలా మంది చెప్పారు. పైగా అన్ సీజన్. ఇక ఈ సినిమా గట్టెక్కడం కష్టం అనుకుంటే.. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించి సేఫ్ అయ్యింది. ‘గచ్చిబౌలి దివాకర్’ గా బ్రహ్మానందం ఈ అద్భుతంగా కామెడీ పండించాడు. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కదిలి రావడం.. ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా లాభాలు కూడా పంచడం జరిగింది