Siddharth: పాన్ ఇండియా సినిమాల్లో నిజాయితీ లోపిస్తుందట..!

ఈ మధ్య కాలంలో హీరో సిద్ధార్థ్ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.ఒక్కోసారి రాజకీయాల పై పడతాడు.. మరోసారి సినిమా వాళ్ళ పై పడతాడు. తానూ సినిమా వాడనే అనే విషయాన్ని మర్చిపోయి మరీ సినిమా వాళ్ళ పై సెటైర్లు వేస్తుంటాడు సిద్దార్థ్. మొన్నామధ్య సమంత విడాకుల అనంతరం ఆమె పై పరోక్షంగా ‘ మోసం చేసేవాళ్ళు బాగుపడరు’ అనే అర్ధం వచ్చేలా ఓ ట్వీట్ వేసాడు.ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

సమంత అభిమానులు సిద్దార్థ్ ను ట్రోల్ చేశారు. అటు తర్వాత టికెట్ రేట్ల ఇష్యు గురించి ఏపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కామెంట్లు చేసాడు. ఇవి కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అదే సమయంలో సిద్దార్థ్ పై ప్రశంసలు కూడా కురిసాయి. ఇదిలా ఉండగా… ఇప్పుడు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు సిద్దార్థ్. ‘ఒక సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనడానికి ఫేక్ కలెక్షన్లే వేసుకోవాలా?

అసలు లెక్కలు మానేసి ఈ ఫేక్ కలెక్షన్లు చూపించడానికి నిర్మాతలు ఎంత కమిషన్ ఇస్తారు? ట్రేడ్ తో పాటు మీడియా కూడా ఫేక్ నంబర్స్ ను ఎలా ప్రచారం చేస్తుందో నాకు అర్ధం కావడం లేదు. అన్ని భాషల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ‘పాన్ ఇండియా’ సినిమాల్లో నిజాయితీ లోభిస్తోంది’ అనే భావన వచ్చేలా సిద్దార్థ్ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో సిద్దార్థ్ ఈ ట్వీట్ ‘పుష్ప’ కలెక్షన్లను ఉద్దేశించే వేసాడని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నిన్న తిరుపతిలో జరిగిన ‘పుష్ప’ సక్సెస్ పార్టీలో యాంకర్ ఉదయభాను అనుకోకుండా ‘పుష్ప’ చిత్రం 4 రోజుల్లో రూ.2003 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఈ కామెంట్లు మొదలయ్యాయి అని స్పష్టమవుతుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus