సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘డిజె టిల్లు’ (DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Squre) సినిమాలతో స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం అతను మార్కెట్ పరంగా, పారితోషికం పరంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత రెండు సినిమాలకి కమిట్ అయ్యాడు సిద్దు. ఒకటి ‘జాక్’ కాగా ఇంకోటి ‘తెలుసు కదా’ అనే సినిమా. ‘జాక్’ సినిమా (Jack Movie) ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈరోజు ‘జాక్’ (Jack Movie) రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇది చాలా డిస్కషన్స్ కి దారి తీసింది. ఎందుకంటే ‘జాక్’ ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో విషయం ఏముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! ఏప్రిల్ 10 కి ప్రభాస్- మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘ది రాజాసాబ్’ రిలీజ్ అవుతుందని నిర్మాతలైన ‘పీపుల్ మీడియా’ వారు ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ డిలే అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే రాలేదు. మరోపక్క ‘ది రాజాసాబ్'(The Rajasaab) పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ కి చిరంజీవి ‘విశ్వంభర’ ని (Vishwambhara) తీసుకురావాలని ఆ సినిమా నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు భావిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఏప్రిల్ 10 న ‘జాక్’ (Jack Movie) రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో ఆ రెండు పెద్ద సినిమాలు రావట్లేదా? అని ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. అందుకే ‘జాక్’ రిలీజ్ డేట్ అనేది చర్చనీయాంశం అయ్యిందని చెప్పాలి.