హీరోలు సిద్ధు జొన్నలగడ్డకి (Siddu Jonnalagadda) , విశ్వక్ సేన్ (Vishwak Sen)..ల మధ్య గొడవ జరిగిందా? ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడట్లేదా? వంటి ప్రశ్నలు ఇప్పుడు ఊపందుకున్నాయి. వాస్తవానికి విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నాగ వంశీ (Suryadevara Naga Vamsi ) మంచి స్నేహితులు. వీరిద్దరూ ఎన్టీఆర్ (Jr NTR), బాలకృష్ణ (Nandamuri Balakrishna)..లతో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. మరి ఇద్దరి మధ్య గొడవేంటి? అసలు ఎక్కడ వచ్చింది ఈ ప్రస్తావన? ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. “మీరు ఇంకో హీరో.. ఇది వరకు చాలా క్లోజ్ గా ఉండేవారు.
Siddu Jonnalagadda vs Vishwak Sen:
కానీ ఈ మధ్య మీ ఇద్దరికీ పట్లేదు అనే టాక్ ఉంది. ఆయన సినిమాపై మీ సినిమా, మీ సినిమాపై ఆయన సినిమా వేసి మీ కోపాన్ని చాటుకుంటున్నారు” అనే టాక్ ఉంది. ఎవరండీ అంటూ సిద్ధు అడిగితే.. ‘విశ్వక్ సేన్’ అంటూ యాంకర్ బదులిచ్చాడు. అతను ఇంకా మాట్లాడుతూ.. ” అతని ‘లైలా’ (Laila) సినిమా రిలీజ్ అయితే.. మీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ (it’s complicated) రీ రిలీజ్ చేసారని, ఇప్పుడు మీ ‘జాక్’ (Jack) రిలీజ్ అవుతుంటే అతను తన ‘ఫలక్ నుమా దాస్’ (Falaknuma Das) రిలీజ్ చేస్తున్నాడని” జనాలు అనుకుంటున్నారు.
దానిపై మీ స్పందన ఏంటి” అంటూ సిద్ధుని అడిగాడు. దానికి సిద్ధు జొన్నలగడ్డ బదులిస్తూ.. “మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆరోజు అతని స్ట్రైట్ రిలీజ్ సినిమాకి.. నా రీ- రిలీజ్ సినిమాకి, ఈరోజు నా స్ట్రైట్ రిలీజ్ కి రీ- రిలీజ్ కి ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా అండి.? నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుండి బజ్ దగ్గర్నుండి, పబ్లిసిటీ దగ్గర్నుండి ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా” అంటూ తెలిపాడు.