Simhadri Collections: ‘సింహాద్రి’ కి 19 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను స్టార్ హీరోని చేసిన చిత్రం ‘సింహాద్రి’. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వి.ఎం.సి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వి.విజయ్ కుమార్ వర్మ మరియు వి.దొరస్వామి రాజు కలిసి నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత లు హీరోయిన్లుగా నటించారు. 2003వ సంవత్సరం జూలై 9న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్ నటనకి ప్రశంసలు కురిపించారు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 19 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.47 cr
సీడెడ్ 5.50 cr
ఉత్తరాంధ్ర 2.32 cr
ఈస్ట్ 1.80 cr
వెస్ట్ 1.70 cr
గుంటూరు 2.20 cr
కృష్ణా 1.86 cr
నెల్లూరు 1.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 23.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  2.25 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  25.40 cr

 

‘సింహాద్రి’ చిత్రానికి రూ.11.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.’స్టూడెంట్ నెంబర్ 1′ వంటి హిట్ కాంబో కావడంతో ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది.ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.25.40 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.13.9 కోట్ల లాభాలు దక్కాయన్న మాట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus